ఐలాపురం హోటల్ 301లో కేఏ పాల్... ఉదయం నుంచి పోలీసుల తనిఖీలు!
- విజయవాడలో బస చేసిన కేఏ పాల్
- టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపణలు
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఆయన తన సహాయకుల నిమిత్తం అదే హోటల్ లో బుక్ చేసుకున్న రూముల్లో కూడా సోదాలు సాగుతున్నాయి. పార్టీ టికెట్ ఇచ్చేందుకు కేఏ పాల్ డబ్బులను వసూలు చేశారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొందరు బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్ కు స్వయంగా ఫిర్యాదు చేయడంతో వారు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.