ఏడుస్తున్న బిడ్డ నోరు మూయించేందుకు... ఏ తల్లీ చేయని పని చేసిన యువతి!

  • బీహార్ లోని చాహాప్రాలో ఘటన
  • తండ్రి ఇంటికి వచ్చేసరికి బిడ్డ నోటి నుంచి నురుగులు
  • ప్రాణాపాయం లేదన్న వైద్యులు
ఏడుస్తున్న తన కుమారుడి నోరును మూయించేందుకు పెదవులపై గమ్ రాసి, వాటిని అంటించిందో కన్న తల్లి. ఈ దారుణ ఘటన బీహార్ లోని చాహాప్రా ప్రాంతంలో జరిగింది. బిడ్డ తండ్రి వెల్లడించిన వివరాల ప్రకారం, "కొంత పనుండి బయటకు వెళ్లాను. ఇంటికి వచ్చే సరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బిడ్డ ఏడవటం లేదేమిటని చూశాను. అతని నోటి నుంచి నురుగు వస్తోంది. ఆందోళనతో ఏం జరిగిందని భార్యను అడిగితే, గుక్కతిప్పుకోకుండా ఒకటే ఏడుస్తున్నాడని చెప్పింది. విసిగిపోయిన తాను, బిడ్డ ఏడుపును ఆపేందుకు గమ్ రాశానని చెప్పింది" అన్నాడు.

 వెంటనే తాను చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లానని, అతనికిప్పుడు ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారని తెలిపాడు. కాగా, ఈ విషయమై పోలీసు కేసు నమోదైందా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.
Go Back to Shorts
Bihar
Mother
Child
Crying
Glue

More Telugu News