చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడుని గొలుసులతో బంధించి గదిలో ఉంచారన్న నార్నే శ్రీనివాసరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడుని గొలుసులతో బంధించి గదిలో ఉంచారన్న నార్నే శ్రీనివాసరావు

  • రామ్మూర్తినాయుడుకి మతి భ్రమించింది
  • దమ్ముంటే ఆయన్ను బయటకు తెచ్చి చూపించగలరా?
  • చంద్రబాబుకు నార్నే శ్రీనివాసరావు సవాల్
తన సొంత సోదరుడు రామ్మూర్తి నాయుడునే పట్టించుకోకుండా, ఆయన్ను సర్వనాశనం చేసిన దుర్మార్గుడు చంద్రబాబునాయుడని వైసీపీ నేత నార్నే శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. 1994లో తనకు టికెట్ ఇవ్వాలని ఎన్టీఆర్ వద్దకు రామ్మూర్తి రాగా, తన సోదరుడికి టికెట్ ఇవ్వవద్దని చంద్రబాబు పట్టుబట్టారని, నాడు లక్ష్మీపార్వతి కల్పించుకుని రామ్మూర్తి నాయుడికి టికెట్ ఇప్పించారని గుర్తు చేసుకున్నారు.

ఆపై అన్న చేసిన మోసంతో రామ్మూర్తి నాయుడికి మతిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో ఎవరికీ తెలియదని, నేడు ఆయన్ను గొలుసులతో కట్టేసి, ఒక రూములో బంధించి వుంచారని అన్నారు. చంద్రబాబునాయుడికి దమ్ముంటే, తన తమ్ముడిని బయటకు తీసుకుని వచ్చి చూపించాలని నార్నే సవాల్ విసిరారు.

అన్న నాకున్నాడన్న గుడ్డి నమ్మకంతో రామ్మూర్తి దారుణంగా మోసపోయారని, తన తమ్ముడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించేందుకు కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని ఆరోపించారు. చంద్రబాబు ఓ మర్రిచెట్టు వంటి వాడని, తన నీడన గడ్డిని కూడా పెరగనివ్వబోడని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అందువల్లే తాను వైఎస్ఆర్ సీపీలో చేరానని చెప్పారు.
Narne
Chandrababu
Ramurti nayudu

More Telugu News