ఈ ఒక్క విషయంలో అయినా చంద్రబాబు, పవన్, కేఏ పాల్ కు క్లారిటీ ఉంది.. సంతోషం!: విజయసాయిరెడ్డి
- ఎన్నికల్లో గెలిచేవారినే లక్ష్యంగా చేసుకుంటారు
- వైసీపీ విజయం ఏపీలో ఖరారైపోయింది
- అందుకే ముగ్గురూ జగన్ ను విమర్శిస్తున్నారు
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘గెలిచే పార్టీనే ఎన్నికల్లో అన్ని పక్షాలు టార్గెట్ చేస్తాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ చివరకు పాల్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ఖరారై పోయిందని అంగీకరిస్తున్నారు. అందుకే జగన్ గారి పైనే విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ విషయం లోనైనా మీ అందరికీ క్లారిటీ ఉంది. సంతోషం’ అని సెటైర్ వేశారు.