Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మురుగదాస్ మూవీలో రజనీ రాజకీయనాయకుడిగా కనిపిస్తాడనేది పుకారేనా?

  • లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ తో మురుగదాస్ 
  • రజనీ కాంత్ ద్విపాత్రాభినయం
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్  
విజయ్ తో 'సర్కార్' చేసి సంచలన విజయాన్ని అందుకున్న మురుగదాస్, తన తదుపరి సినిమాను రజనీకాంత్ తో చేస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా.. మరో పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపిస్తారనే ప్రచారం కోలీవుడ్లో జోరుగా జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయడం .. ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండటం నిజమేనట.

అయితే మరో పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడనే వార్తలో మాత్రం నిజం లేదట. మరో పాత్రలో ఆయన సామాజిక సేవకుడిగా కనిపిస్తారని అంటున్నారు. ఒక సామాజిక సేవకుడిగా ఆయన పోరాడే అంశం చాలా బలమైనదిగా ఉంటుందని చెబుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మురుగదాస్ .. రజనీ కాంబినేషన్లో తొలిసారిగా రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.
rajani

More Telugu News