నరేష్ వ్యాఖ్యలపై రాజశేఖర్ అసంతృప్తి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నరేష్ వ్యాఖ్యలపై రాజశేఖర్ అసంతృప్తి!

  • 'మా' అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నరేష్
  • 'నేను' అన్న నరేష్ మాటలను తప్పుబట్టిన రాజశేఖర్
  • 'మేము' అని మాట్లాడితే బాగుంటుందని హితవు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఆయన మాట్లాడిన తీరుపై నటుడు రాజశేఖర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసోసియేషన్ కోసం 'నేను' బాగా కష్టపడతానని మాటిస్తున్నానని నరేష్ అన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, నరేష్ మాట్లాడిన ప్రతి మాటలో 'నేను' అనే పదం తప్ప 'మేము' అనే పదమే లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేష్ అన్నీ మాట్లాడేశారని.. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడటం తనకు ఇష్టం లేదంటూ మైక్ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయారు.

అ తర్వాత మళ్లీ జీవిత చేతిలో నుంచి మైక్ తీసుకుని... తాను మాట్లాడేందుకు చాలా ఉందని, ఓపిక ఉంటే వినవచ్చని రాజశేఖర్ అన్నారు. 'నేను' అని కాకుండా 'మేము' అని నరేష్ మాట్లాడాలని... ఈ కార్యక్రమానికి తాను రావాలనుకోలేదని, నరేష్ వచ్చి పిలిస్తేనే వచ్చానని, ఆయన తనకు మంచి మిత్రుడు కాబట్టే వచ్చానని చెప్పారు. ఇకపై నరేష్ 'మేము' అని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. పక్కనే ఉన్న నరేష్ కల్పించుకుని... తానేదో సరదాగా అన్నానని, మనమందరం కలిసే పని చేద్దామంటూ రాజశేఖర్ ను సముదాయించారు.
naresh
rajasekhar
maa
tollywood

More Telugu News