ఏపీ పోలీసులపై నమ్మకం లేదు.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించండి: సీఈసీకి వైయస్ వివేకా కుమార్తె ఫిర్యాదు

  • సునీల్ అరోరాను కలిసిన సునీతారెడ్డి
  • తండ్రి హత్య కేసును ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని వినతి
  • నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన సునీత
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధానాధికారి సునీల్ అరోరాను దివంగత వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణను ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర పోలీసులు చేపట్టే విచారణలో అసలు నిజాలు వెలుగులోకి రావని... ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని విన్నవించారు. మరోవైపు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కూడా సునీత తన భర్తతో కలసి నిన్న కలిసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
ys viveka
murder
daughter
sunitha
cec

More Telugu News