టీడీపీ ధన బలంతో గెలవాలని చూస్తోంది...ఈసీ అడ్డుకోవాలి: జీవీఎల్
- ఏపీలో ప్రధాన పక్షాలు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నాయి
- అవినీతి ప్రభుత్వాలు ప్రజాసేవ చేయలేవు
- ధన ప్రవాహం కనిపిస్తే వీడియోతీసి సీవీజీఎల్ యాప్‌కు పంపండి
తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతి పరులు ప్రజాసేవ చేస్తారనుకోవడం ఒట్టి భ్రమేనని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పక్షాలు రానున్న ఎన్నికల్లో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఎన్నికల సంఘం మరింత మంది నిఘా అధికారులను నియమించి విచ్చలవిడిగా డబ్బు పంపిణీని అడ్డుకోవాలని కోరారు. వేల కోట్ల నల్ల ధనం మార్కెట్‌కు వస్తోందని, డబ్బు పంపిణీని ఎవరైనా చూస్తే వీడియోతీసి సీజీవీఎల్ యాప్‌కు షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.