నారాయణ వైద్య కళాశాలలో ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నారాయణ వైద్య కళాశాలలో ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు

  • గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు
  • ఉత్తుత్తి ఫోన్ కాల్ గా గుర్తింపు
  • డబ్బులేదని గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్
 నెల్లూరు నారాయణ వైద్య కళాశాలలో గురువారం ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.  నారాయణ మెడికల్ కళాశాలలో భారీగా డబ్బు దాచి ఉంచారంటూ ఓ వ్యక్తి 'సి విజిల్' యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రేవు ముత్యాలరాజు వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ ను అప్రమత్తం చేశారు. నేరుగా నారాయణ మెడికల్ కాలేజీకి వెళ్లి క్షుణ్ణంగా సోదాలు జరిపిన ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడేమీ డబ్బులేదని గుర్తించింది.  అది ఉత్తుత్తి ఫోన్ కాల్ అని భావిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారికి ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ విషయాన్ని తెలిపింది. 
Chandrababu
Telugudesam

More Telugu News