Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మనసును తాకుతోన్న 'మజిలీ' పాట

  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 
  • వనమాలి అందించిన సాహిత్యం 
  • ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల  
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య .. సమంత జంటగా 'మజిలీ' సినిమా నిర్మితమైంది. సాహు గారపాటి .. హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'హోలీ' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"నువ్వు నిజంలాగా నను ముడేస్తుంటే ఈ నిమిషాన .. నేను గతంలోని ఆ కలల్లోనే వున్నా .., నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలా నను చూస్తున్నా .. నేను అదే పనిగా నిను వెలేస్తూనే వున్నా .." అంటూ ఈ పాట సాగుతోంది. చైతూ .. సమంత పాత్రల నేపథ్యంలో ఈ పాట వస్తుందని అర్థమవుతోంది. బరువైన భావాలను హుషారైన బీట్ లో గోపీసుందర్ ఆవిష్కరించిన తీరు బాగుంది. వనమాలి అందించిన సాహిత్యం అర్థవంతంగా .. అందంగా వుంది. అరుణ్ గోపన్ .. చిన్మయి శ్రీపాద .. బేబీ అనూష ఆలాపన మనసును తాకేలా వుంది.
chaitu
samanta

More Telugu News