నీరవ్ మోదీ సామాన్యుడు కాదు... తప్పించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ ఎత్తుగడ!
- సింగపూర్ లో శాశ్వత నివాసం కోసం ప్రయత్నం
- వెనౌటు పౌరసత్వానికి దరఖాస్తు
- రూపాన్ని మార్చుకునేందుకూ ఆరాటం
బ్రిటన్ లో శాశ్వత ఆశ్రయం పొందేందుకు లీగల్ సేవలు అందించే ప్రముఖ సంస్థలను సంప్రదించడం దగ్గర్నుంచి వెనౌటు అనే చిన్న పసిఫిక్ దీవిలో పౌరసత్వం కోసం ప్రయత్నించడం వరకు ముమ్మరంగా అడ్డదారులు వెతికాడు. ఓ దశలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా పూర్తిగా మార్చుకోవాలని కూడా ఎత్తుగడ వేశాడు. చివరికి సింగపూర్ లో శాశ్వత నివాసం కోసం కూడా విపరీతంగా శ్రమించాడు. కానీ, అవేవీ నెరవేరకముందే బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి ఆశలపై నీళ్లు చల్లారు.