శ్రీకాకుళంలో సోము వీర్రాజుకు చేదు అనుభవం!

  • బీ-ఫారమ్స్ ఇచ్చేందుకు వెళ్లిన సోము వీర్రాజు ఘెరావ్
  • టికెట్లు అమ్ముకున్నారని అసంతృప్త నేతల ఆరోపణ
  • పార్టీ కోసం పని చేసే వారిని నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం
ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాకుళంలో తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారమ్స్ ఇచ్చేందుకు సోము వీర్రాజు తమ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలు కొందరు ఆయన్ని ఘెరావ్ చేశారు. టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ సోము వీర్రాజుపై విరుచుకుపడ్డారు. పార్టీ కోసం పని చేసే వారిని నిర్లక్ష్యం చేసిన బీజేపీ జాతీయ స్థాయి నేతలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Go Back to Shorts
srikakulam
bjp
somu veera raj
gherao

More Telugu News