Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా అబ్బాయి తప్పేమీ లేదు: శింబు తండ్రి టి.రాజేందర్

  • అజిత్ రాజకీయాల్లోకి రావాలన్న సుశీంద్రన్  
  • మా నాన్నే తమిళనాడుకి కాబోయే సీఎమ్ అన్న శింబు సోదరుడు 
  • ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన అభిమానులు
తమిళ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అజిత్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. దాంతో తనకి అసలు అలాంటి ఆలోచనే లేదని అజిత్ స్పష్టం చేశాడు. అయినా ఆయన రాజకీయాల్లోకి రావాలనీ .. తమిళ రాజకీయాల్లో ఆయన రాకతోనే మంచి మార్పు మొదలవుతుందని పేర్కొంటూ దర్శకుడు సుశీంద్రన్ ఒక లేఖను విడుదల చేశాడు.

టి. రాజేందర్ తనయుడు .. శింబు సోదరుడు కురాలారాసన్ పేరుతో వున్న ఒక ట్విట్టర్ ఎకౌంట్ నుంచి సుశీంద్రన్ పోస్టుకు సమాధానం వచ్చింది. అజిత్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను తప్పుబడుతూ, 'మా నాన్నే తమిళనాడుకి కాబోయే సీఎమ్' అంటూ కామెంట్ వచ్చింది. దాంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంపై టి. రాజేందర్ స్పందిస్తూ .. "ఆ ట్విట్టర్ అకౌంట్ మా అబ్బాయిది కాదు .. ఫేక్. మా అబ్బాయి పేరుతో ఫేక్ ఎకౌంట్ ను క్రియేట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము" అని హెచ్చరించారు.
rajendar

More Telugu News