నాపై పోటీకి నిలబెట్టడానికి కేసీఆర్ కు అభ్యర్థి కూడా దొరకడం లేదు: రేవంత్ రెడ్డి
- రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తా
- రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు
- ప్రతిపక్షమే లేనప్పుడు.. ఇలాంటి ఎన్నికలు ఎందుకు?
తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని పాలనను ఊహించలేమని అన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపేందుకు ప్రతిపక్షమే లేనప్పుడు... ఇలాంటి ఎన్నికలను నిర్వహించి ఏం లాభమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరాలనుకోవడానికి గల కారణాలేంటో సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డిలు కార్యకర్తలకు చెప్పాలని డిమాండ్ చేశారు.