యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన టెన్త్ విద్యార్థి... పరీక్షలు జరుగుతుండటంతో తలపట్టుకున్న పోలీసులు!
- హైదరాబాద్ ఛత్రినాకలో ఘటన
- వీడియో తీసి స్నేహితులకు పంపిన విద్యార్థి
- బాధితురాలికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆమె స్నానం చేస్తుండగా, తన సెల్ ఫోన్ లో రహస్యంగా వీడియో తీసి, వాటిని స్నేహితులకు పంపి, డిలీట్ చేశాడు. విషయం తెలుసుకున్న మహిళ, ఛత్రినాక పోలీసులను ఆశ్రయించింది. ఆపై మూడు రోజులైనా అరెస్ట్ చేయలేదంటూ, స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయింది. వీడియో దృశ్యాలను డిలిట్ చేయడంతో సైబర్ క్రైమ్ నిపుణులను సంప్రదించామని, ఇంకా రిపోర్ట్ రాలేదని, పైగా బాలుడు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నాడని చెప్పి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.