Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాలిలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 21 మంది సైనికులు మృతి

  • సైనిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులు
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు
  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు ఒక్కటి కావాలని పిలుపు
ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 21 మంది సైనికుల ప్రాణాలను బలితీసుకున్నారు. సెంట్రల్ మాలిలోని సైనిక స్థావరంపై ఆదివారం జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చిన దుండగులు దియౌరాలోని సైనిక స్థావరంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 21 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. ఉగ్రదాడిపై స్పందించిన అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకార్ కిటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
Mali
gunmen
Terror attack
dead

More Telugu News