'అరటితోట దగ్ధం' కేసుతో వెలుగులోకి వచ్చిన వ్యక్తికి బాపట్ల వైసీపీ ఎంపీ టికెట్!
- సురేష్ పేరును ఖరారు చేసిన జగన్
- సంచలనం సృష్టించిన అరటితోట దగ్ధం కేసు
- ఆ సమయంలోనే వైసీపీకి దగ్గరయ్యారు
వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన 9 మంది పేర్లలో తొలిపేరు సురేష్దే కావడం విశేషం. ఉద్దండరాయుని పాలెంలో అరటితోట దగ్ధం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో సురేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సమయంలోనే సురేష్ వైసీపీకి చాలా దగ్గరయ్యారు. మొదట వైసీపీ యువజన విభాగం నాయకుడిగా కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.