పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? అంత ఘోరంగా చంపుతారా?: వివేకా హత్యపై కేఏ పాల్ ఆగ్రహం

  • ఒక దైవ బిడ్డను చంపేందుకు చేతులు ఎలా వచ్చాయి?
  • దుష్టులారా మిమ్మల్ని దేవుడు సర్వ నాశనం చేస్తాడు
  • మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీబీఐతో విచారణ జరిపిస్తా
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆకాశాన్ని తాకిందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్య దీనికి నిదర్శనమని చెప్పారు. పీస్ మిషన్ కు సంబంధించిన సమస్యలపై తనతో కలసి వివేకా అప్పటి విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో పోరాడారని తెలిపారు. అలాంటి మంచి మనిషిని హత్య చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? అంత ఘోరంగా చంపుతారా? అంటూ నిప్పులు చెరిగారు.

ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వివేకా హత్యపై సీఐడీ, సీబీఐల చేత... అవసరమైతే ఎఫ్బీఐ చేత విచారణ చేయిస్తానని అన్నారు. ఒక దైవ బిడ్డను చంపేశారని... అలాంటి వ్యక్తిని చంపేందుకు మీకు చేతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దుర్మార్గులారా, దుష్టులారా మిమ్మల్ని దేవుడు సర్వ నాశనం చేస్తాడంటూ శపించారు. వివేకా కుటుంబసభ్యులపై దేవుడి కృప ఉండాలని ప్రార్థించారు.
Go Back to Shorts
ys viveka
murder
ka paul
prajashanthi party

More Telugu News