కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కేసీఆర్ అన్న కూతురు
- త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్న కల్వకుంట్ల రమ్యారావు
- గతంలో కేసీఆర్ ను తిట్టిపోసిన వైనం
- తాజాగా కారెక్కాలని నిర్ణయం
ఈ క్రమంలో, సీఎం కేసీఆర్ అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. రమ్యారావు కాంగ్రెస్ లో ఉన్నంతకాలం కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజాకూటమి తరఫున కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని కోసం ప్రచారం కూడా చేశారు. అలాంటి నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరనుండడం రాజకీయ వైచిత్రిగా భావించాలి.