డేటా చోరీ దర్యాప్తు వేగవంతం.. అశోక్ కు అరెస్ట్ వారెంట్ జారీ

  • ఇప్పటికే అశోక్ కు లుకౌట్ నోటీసులు
  • అజ్ఞాతంలో ఉన్న అశోక్
  • 41 సీఆర్పీసీ కింద అరెస్ట్ వారెంట్ జారీ
డేటా చోరీ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ కు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసినా... అశోక్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 41 సీఆర్పీసీ కింద అశోక్ కు సిట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు, ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులు ఇచ్చిన వివరాల ఆధారంగా సిట్ విచారణ జరుపుతోంది. ఈ నెల 20న కోర్టుకు సిట్ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. 
Go Back to Shorts
it grids
data theft
sit
ashok

More Telugu News