సొంత గూటికి బుట్టా రేణుక.. కర్నూలులో టీడీపీకి షాక్
- కోట్ల చేరికతో మారిన సమీకరణాలు
- ఆదోని నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న అధిష్ఠానం
- రాజ్యసభకు పంపుతామన్నా కరగని రేణుక
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరికతో కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆయన కుటుంబానికి కేటాయించాలని టీడీపీ నిర్ణయించిందని, దీంతో సిట్టింగ్ ఎంపీ అయిన రేణుకకు ఆదోని అసెంబ్లీ స్థానాన్ని ఆఫర్ చేసిందని సమాచారం. అయితే, అసెంబ్లీకి వెళ్లేందుకు రేణుక ససేమిరా అన్నట్టు చెబుతున్నారు. రేణుకను వదులుకోవడానికి ఇష్టంగా లేని టీడీపీ అధిష్ఠానం రాజ్యసభకు పంపుతామన్న హామీ ఇచ్చినా ఆమె మాత్రం పార్టీ వీడేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.