కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ.. టీఆర్ఎస్ లో చేరనున్న పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి!
- టీఆర్ఎస్ నేత కేటీఆర్ తో నేడు భేటీ
- త్వరలో పార్టీలో చేరుతానని ప్రకటన
- తుమ్మలను పాలేరులో ఓడించిన ఉపేందర్ రెడ్డి
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను టీఆర్ఎస్ లో చేరుతానని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. అనుచరులు, కార్యకర్తలు, మద్దతుదారుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు కాంగ్రెస్ ను వీడిన సంగతి తెలిసిందే. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కారు ఎక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.