సత్తెనపల్లి నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా.. వైసీపీ వాళ్లు ముక్కున వేలేసుకోవాల్సిందే!: కోడెల శివప్రసాద్
- టీడీపీ అన్నది పెద్ద కుటుంబం లాంటిది
- మరోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు
- గుంటూరులో మీడియాతో ఏపీ స్పీకర్
తనకు రెండోసారి అవకాశం కల్పించిన టీడీపీ హైకమాండ్ కు కోడెల ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో అందరూ కలిసి తనను గెలిపించారనీ, ఈ ఎన్నికల్లోనూ అలాగే కలసికట్టుగా పనిచేయాలని టీడీపీ శ్రేణులను కోరారు. ఈ ఎన్నికల్లో 15,000 మెజారిటీతో ఘనవిజయం సాధిస్తాననీ, తన గెలుపును చూసి వైసీపీ నేతలు ముక్కున వేలేసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.