టీడీపీ తరపున అమలాపురం లోక్‌సభ బరిలో హర్షకుమార్‌?

  • గతంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ
  • ఈవేళ చంద్రబాబును కలవనున్న మాజీ ఎంపీ
  • భేటీ అనంతరం నిర్ణయం వెలువడే అవకాశం
అమలాపురం లోక్‌సభ నియోకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎంపీ హర్షకుమార్‌ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో అమరావతిలో ఈరోజు హర్షకుమార్‌ భేటీకానుండడంతో ఈ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఈ స్థానం నుంచి హర్షకుమార్‌ పోటీ చేసి గెలుపొందారు.

 రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో కాంగ్రెస్‌ ప్రాభవం కోల్పోవడంతో హర్షకుమార్‌ ఈసారి సైకిలెక్కి అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. హర్షకుమార్‌తో భేటీ అనంతరం ఈ విషయంపై చంద్రబాబు ఒక ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు. లోక్‌సభకు హర్షకుమార్‌ పేరు ఖరారైతే అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి జి.ఎం.సి. హరీష్‌మాధుర్‌ను పోటీ చేయించే అవకాశం ఉందంటున్నారు.
Go Back to Shorts
amalapuram
harshakumar
Lok Sabha
Chandrababu

More Telugu News