నన్ను ఎదుర్కోలేకే.. మావోయిస్టుల పేరుతో లేఖలు సృష్టిస్తున్నారు: యరపతినేని
- మావోల లేఖల పేరుతో వైసీపీ నాటకాలాడుతోంది
- నకిలీ లేఖలు తయారు చేసిన వారిని బయటకు లాగుతాం
- 25వేల ఓట్ల మెజార్టీతో నేను గెలవడం ఖాయం
గురజాల నియోజవర్గంలో రూ. 1600 కోట్ల నిధులతో అభివృద్ధి జరిగిందని... టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని... తనను ఎదుర్కోలేకే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని యరపతినేని చెప్పారు. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. మావోయిస్టుల పేరుతో నకిలీ లేఖను తయారుచేసిన వారిని బయటకు లాగుతామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాను 25వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు.