జగన్ నివాసం వద్ద ఎమ్మెల్యే సునీల్ కు చేదు అనుభవం

  • పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కు టికెట్ దక్కకపోవచ్చనే ఊహాగానాలు
  • జగన్ నివాసం వద్ద రెండు గంటలు వేచి చూసినా లోపలకు అనుమతించలేదు
  • పట్టించుకోకుండా లోపలకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కు చేదు అనుభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు... ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని జగన్ నివాసం వద్దకు కుటుంబసభ్యులతో కలసి ఆయన వచ్చారు. దాదాపు రెండు గంటల సేపు జగన్ నివాసం వద్ద వేచి చూసినా... ఆయనను లోపలకు అనుమతించలేదు. ఇదే సమయంలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడకు వచ్చారు. సునీల్ ను పట్టించుకోకుండా ఆయన లోపలకు వెళ్లిపోయారు. ఈ ఘటనతో సునీల్ మరింత మనస్తాపానికి గురయ్యారు.
Go Back to Shorts
pootalapattu
ysrcp
mla
sunil
jagan

More Telugu News