మసూద్‌ని ‘జీ’ అని సంబోధించిన రాహుల్.. ఏకి పారేస్తున్న బీజేపీ!
- కాందహార్ ఘటనను ప్రస్తావించిన రాహుల్
- ఎన్డీయే ప్రభుత్వమే విడిచిపెట్టిందని వెల్లడి
- అజిత్ దోవల్ స్వయంగా అప్పగించారన్న రాహుల్
దీనిలో భాగంగా కాందహార్ ఘటనను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మసూద్ ‘జీ’ని అప్పటి ఎన్డీయే ప్రభుత్వమే విడిచిపెట్టిందని.. ఇప్పటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అప్పట్లో స్వయంగా కాందహార్ వెళ్లి మరీ అప్పగించారని తెలిపారు. దీంతో బీజేపీ.. రాహుల్‌కూ, పాక్‌కూ ఉగ్రవాదులంటే అమితమైన ప్రేమ అని అంతర్జాతీయ టెర్రరిస్టును ‘జీ’ అంటూ సంబోదిస్తారా? అంటూ విరుచుకుపడింది. టెర్రరిస్టులను గౌరవించడమంటే పరోక్షంగా పుల్వామా అమరవీరులను అవమానించడమేనంటూ స్మృతి ఇరానీ.. రాహుల్‌ని విమర్శించారు.