Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంబానీ తనయుడి పెళ్లిలో తారాతోరణం.. అంతర్జాతీయ ప్రముఖుల రాక​

  • ముంబయిలో ఆకాశ్ అంబానీ వివాహ వేడుకలు
  • శనివారం సాయంత్రం పెళ్లి
  • కదిలివచ్చిన సెలబ్రిటీ లోకం
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల వివాహం ఈ సాయంత్రం ముంబయిలో జరగనుంది. ఈ సెలబ్రిటీ వివాహ మహోత్సవానికి బాలీవుడ్ తారలు, క్రీడాలోకం మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రముఖులు కూడా విచ్చేశారు.

బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆయన భార్య చెరీ బ్లెయిర్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, తెలుగుతేజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ప్రియాంకా చోప్రా తదితరులు వివాహ వేడుకల్లో కనిపించారు.

సచిన్, షారుఖ్, అమీర్, అభిషేక్ భార్యాసమేతంగా ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. కాగా, ఆకాష్, శ్లోకా బాల్యస్నేహితులు. వీరి మధ్య సాన్నిహిత్యానికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలపడంతో పెళ్లి వరకు వచ్చారు. ఈ హైఫై మ్యారేజ్ కి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా నిలుస్తోంది.
Reliance

More Telugu News