చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన గౌరు చరితా రెడ్డి దంపతులు
- గుండ్లేరుకు శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు
- చెరువులను నింపేందుకు చర్య తీసుకోవాలి
- ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు
ఈ సందర్భంగా చరితా రెడ్డి మాట్లాడుతూ.. ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లోని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరినట్టు తెలిపారు. కర్నూలు జిల్లా ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో గుండ్లేరుకు శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు తెలిపినట్టు చరిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ జిల్లాను ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తానని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.