చంద్రబాబు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు?: టీ- మంత్రి తలసాని

  • చోరీ అయిన సమాచారం టీడీపీది అంటారు 
  • మరి కాసేపు ప్రభుత్వ సమాచారమంటారు
  • దరిద్రమైన ఆలోచనలన్నీ చంద్రబాబుకే ఉంటాయి
డేటా చోరీ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చోరీ అయిన సమాచారం తమ పార్టీది అని కాసేపు, ప్రభుత్వ సమాచారమని మరి కాసేపు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

దరిద్రమైన ఆలోచనలన్నీ చంద్రబాబుకే ఉంటాయని, ఏపీ పోలీస్ అధికారులను, ప్రభుత్వ కార్యదర్శులను నిండా ముంచుతారంటూ బాబుని విమర్శించారు. టీడీపీ నాయకుడు హరికృష్ణ భౌతికకాయం పక్కనే రాజకీయాల గురించి మాట్లాడిన చంద్రబాబుకు నైతిక విలువలు ఎక్కడ ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
minister
talasani

More Telugu News