Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పరమ చెత్తగా ఆడుతున్నావ్ సైనా!... గేమ్ మధ్యలో క్లాస్ పీకిన భర్త!

  • ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సైనా ఓటమి
  • ఫలించని కాశ్యప్ బోధనలు
  • తైవాన్ భామకు తలొగ్గిన ఇండియన్ స్టార్
భారత బ్యాడ్మింటన్ రంగంలో అగ్రశ్రేణి క్రీడాకారులుగా పేరుతెచ్చుకున్న సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సైనా మహిళల విభాగంలో స్టార్ గా కొనసాగుతోంది. కశ్యప్ కూడా పురుషుల విభాగంలో మంచి ఆటగాడని చెప్పాలి. అసలు విషయానికొస్తే... సైనా బర్మింగ్ హామ్ లో జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ఘోర పరాభవం చవిచూసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తైవాన్ కు చెందిన వరల్డ్ నంబర్ 1 తై జు యింగ్ చేతిలో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు కశ్యప్ కూడా అక్కడే ఉన్నాడు. సైనా ఆడుతున్న తీరును నిశితంగా పరిశీలించిన కశ్యప్ పలుమార్లు ఆమెపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

భార్య అని కూడా చూడకుండా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. "చెత్త షాట్లు ఆడుతున్నావ్ సైనా. ఈ మ్యాచ్ గెలవాలంటే మాత్రం నువ్వు క్రమశిక్షణతో ఆడాల్సిందే. షటిల్ ను కంట్రోల్ చేయాలి. ఆ తర్వాతే షాట్లు ఆడు. డ్రాప్ షాట్లను లిఫ్ట్ చేస్తూ ప్రత్యర్థికి కోర్టంతా ఖాళీగా చూపిస్తున్నావు" అంటూ చిరుకోపం ప్రదర్శించాడు. అయితే కశ్యప్ బోధనలు ఫలించలేదు. ఈ మ్యాచ్ లో సైనా 37 నిమిషాల్లోనే ఓటమిపాలైందంటేనే ఎంత చెత్తగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు!
Saina Nehwal

More Telugu News