రెండు సార్లు చిరుమర్తికి టికెట్ ఇప్పించా.. ఇంత నమ్మకద్రోహం చేస్తాడని అనుకోలేదు!: రాజగోపాలరెడ్డి
- టీఆర్ఎస్ లో చేరుతున్న విషయం టీవీలో చూశా
- చిరుమర్తి పార్టీ మారడం బాధాకరం
- నల్గొండలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చిరుమర్తి లింగయ్య ఈరోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు లింగయ్య చెప్పగా, అందుకు కేసీఆర్ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన కారు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఒప్పుకోలేదు. అయితే గట్టిగా పట్టుబట్టిన కోమటిరెడ్డి సోదరులు లింగయ్యకు టికెట్ ఇప్పించారు.