రెండు సార్లు చిరుమర్తికి టికెట్ ఇప్పించా.. ఇంత నమ్మకద్రోహం చేస్తాడని అనుకోలేదు!: రాజగోపాలరెడ్డి

  • టీఆర్ఎస్ లో చేరుతున్న విషయం టీవీలో చూశా
  • చిరుమర్తి పార్టీ మారడం బాధాకరం
  • నల్గొండలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ నేత, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారాలని నిర్ణయించుకోవడం బాధాకరమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. చిరుమర్తికి తాము రెండు సార్లు టికెట్ ఇప్పించామనీ, అలాంటిది తమకు ఇంత నమ్మకద్రోహం చేస్తాడని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ మారుతున్న విషయాన్ని తాము టీవీలో చూసి తెలుసుకున్నామని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో ఈరోజు మీడియాతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చిరుమర్తి లింగయ్య ఈరోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు లింగయ్య చెప్పగా, అందుకు కేసీఆర్ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన కారు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఒప్పుకోలేదు. అయితే గట్టిగా పట్టుబట్టిన కోమటిరెడ్డి సోదరులు లింగయ్యకు టికెట్ ఇప్పించారు.
Go Back to Shorts
Telangana
Congress
KAMOATIREDDY
rajgopal reddy
lingayya
chirumarti

More Telugu News