‘ఐటీ గ్రిడ్స్’ డేటా చోరీ కేసు.. నేడు బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ సిట్ చీఫ్ బాలసుబ్రహ్మణ్యం!
- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు
- మరో రెండ్రోజుల్లో హైదరాబాద్ కు వెళ్లనున్న సిట్
- ఐటీ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న అధికారులు
టీడీపీ నేతలు డేటా చోరీపై ఇప్పటికే తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఏపీ సిట్ విచారణ కోసం హైదరాబాద్ కు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో వాస్తవాలను తెలుసుకునేందుకు సిట్ పోలీసులు ఐటీ నిపుణులతో సైతం సంప్రదింపులు జరుపుతున్నారు.