సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- చిరంజీవి సినిమాలో శ్రుతి హాసన్
- 'మహర్షి' ట్రైలర్ వచ్చేస్తోంది
- 'చిత్రలహరి' విడుదల తేదీ ఖరారు
* మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కలయికలో వస్తున్న 'మహర్షి' చిత్రం ట్రైలర్ ను ఈ నెల 21న విడుదల చేయనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేస్తారు.
* సాయిధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న 'చిత్రలహరి' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరింది. కల్యాణి ప్రియదర్శిన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 12న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.