జమ్ములో పేలుడు...18 మందికి తీవ్రగాయాలు

జమ్ములోని బస్టాండ్‌లో గురువారం పేలుడు సంభవించింది. బస్సు కింద అమర్చిన గ్రేనేడ్‌ పేలిన ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పుల్వామా దాడి ఘటన మరువక ముందే ఈ సంఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు.


More Telugu News