హీరోగా కార్తీ .. కీలకమైన పాత్రలో జ్యోతిక

  • 'దృశ్యం' దర్శకుడితో కార్తీ 
  • విభిన్నమైన కథాకథనాలు
  •  త్వరలో పూర్తి వివరాలు    
జయాపజయాల సంగతి అటుంచితే తమిళంలో కార్తీ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తెలుగులోను ఆ సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. త్వరలో ఆయన మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మలయాళంలో దర్శకుడిగా జీతూ జోసెఫ్ కి మంచి పేరు వుంది.ఆయన దర్శకత్వంలో అక్కడ తెరకెక్కిన 'దృశ్యం' .. తెలుగుతోపాటు ఇతర భాషల్లోను భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి జీతూ జోసెఫ్ .. కార్తీ హీరోగా ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఇది కూడా వైవిధ్యభరితమైన కథాకథనాలతో సాగే సినిమానే. ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం జ్యోతికను తీసుకున్నట్టుగా సమాచారం. కథ .. తన పాత్రలోని కొత్తదనం కారణంగానే ఈ సినిమా చేయడానికి జ్యోతిక అంగీకరించిందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
karthi
jyothika

More Telugu News