Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోటీ నుంచి తప్పుకున్న నాని .. 'జెర్సీ' కొత్త రిలీజ్ డేట్

  • ఏప్రిల్ 5వ తేదీన 'మజిలీ'
  • ఏప్రిల్ 19కి వాయిదా పడిన 'జెర్సీ'
  • 'మహర్షి' రిలీజ్ డేట్ మారడమే కారణం  
నాని కథానాయకుడిగా .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' సినిమా నిర్మితమైంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ఇంతకుముందు ప్రకటించారు. అదే రోజున చైతూ .. సమంతల 'మజిలీ' థియేటర్స్ కి రానుంది.

అయితే ఏప్రిల్ 25వ తేదీన అనుకున్న 'మహర్షి' మే 9వ తేదీకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సోలో రిలీజ్ ఉండాలనే ఉద్దేశంతో, 'జెర్సీ'ని ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చేసినట్టు సమాచారం. అధికారికంగా వాళ్లు ఈ విషయాన్ని ప్రకటించవలసి వుంది. సోలో రిలీజ్ కోసం 'జెర్సీ' ఏప్రిల్ 19కి వెళితే .. 'మజిలీ'కి కూడా సోలో రిలీజ్ దక్కుతుంది. ఇప్పటివరకూ చైతూకి నాని గట్టి పోటీ ఇస్తాడని అనుకున్నారు .. ఇక అలా జరగదన్న మాట. 
nani
shraddha srinadh

More Telugu News