‘ఓట్ల తొలగింపు’పై టీడీపీ సీరియస్.. కృష్ణా జిల్లా కలెక్టర్ కు మంత్రి దేవినేని, టీడీపీ నేతల ఫిర్యాదు!

  • విజయవాడలో కలెక్టర్ ఇంతియాజ్ తో భేటీ
  • వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఫిర్యాదు
  • ఫామ్-7 ను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో గవర్నర్ నరసింహన్ తో ఇటీవల సమావేశమైన ప్రతిపక్ష నేత జగన్.. ఏపీలో జరుగుతున్న పరిస్థితులపై ఆయనకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను వైసీపీ నేతలు ఫామ్-7 ద్వారా తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ఈరోజు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ను కలుసుకున్నారు.

టీడీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఫామ్-7 ద్వారా తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
YSRCP
Vijayawada
collector
complaint

More Telugu News