చెప్పులతో కొట్టుకుని.. పిడిగుద్దులు కురిపించుకున్న యూపీ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే
- సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ది కమిటీ సమావేశం
- హాజరైన ఎంపీ శరద్ త్రిపాఠి, ఎమ్మెల్యే రాకేశ్ సింగ్
- ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం
- మొత్తం ఘటనపై బీజేపీ సీరియస్
అది కాస్తా తీవ్రమై ఆగ్రహావేశాలతో చెప్పులతో కొట్టుకుని.. పిడిగుద్దులు కురిపించుకునే వరకూ వెళ్లింది. అక్కడ ఉన్న నేతలు, అధికారులు కూడా వారిని శాంతింప చేయలేక పోయారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు వచ్చి ఇద్దరినీ శాంతింపజేశారు. ఎంపీపై చర్య తీసుకోవాలంటూ ఎమ్మెల్యే మద్దతుదారులు ఆందోళన నిర్వహించారు. ఈ మొత్తం ఘటనపై యూపీ బీజేపీ సీరియస్ అయింది. ఇద్దరు నేతలపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది.