Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోల్ కతాలో రాజమౌళి మూవీ భారీ షెడ్యూల్

  • కోల్ కతాలో 40 రోజుల పాటు షూటింగ్
  • యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి         
రాజమౌళి రూపొందిస్తోన్న భారీ మల్టీస్టారర్ ప్రస్తుతం హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను .. చరణ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక్కడి షెడ్యూల్ పూర్తికాగానే, కోల్ కతాలో తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.

40 రోజుల పాటు అక్కడ జరిగే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ .. చరణ్ కాంబినేషన్లోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. అక్కడ తీయనున్న ఈ సీన్స్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలవడం ఖాయమని అంటున్నారు. అయితే అక్కడ అవుట్ డోర్లో తీస్తారా? లేకపోతే ఎక్కడైనా భారీ సెట్స్ వేశారా? అనేది తెలియాల్సి వుంది. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా అలియా భట్ .. పరిణీతి చోప్రా పేర్లు వినిపిస్తున్నాయి. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. అటు చరణ్ అభిమానులు వేయికళ్లతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ntr
chsaran

More Telugu News