రాజమౌళి సినిమా కోసం అజయ్ దేవగణ్ .. అలియా భట్ తో బేరసారాలు

  • షూటింగు దశలో రాజమౌళి మూవీ
  • బిజీగా వున్న అజయ్ దేవగణ్ .. అలియా
  • రంగంలోకి దిగిన కార్తికేయ     
రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో కథానాయికలు ఎవరనే విషయం ఇంకా తేలలేదు. ఒక కీలకమైన పాత్ర కోసం అజయ్ దేవగణ్ ను .. ఒక హీరోయిన్ గా అలియా భట్ ను తీసుకోనున్నారనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఈ ప్రచారంలో నిజం ఉందనేది తాజా సమాచారం.అజయ్ దేవగణ్ ఇతర భాషా చిత్రాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తిని చూపించడు. ఒకవేళ ఆయన ఒప్పుకున్నా పారితోషికం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో కథానాయికగా అలియా భట్ ఒక రేంజ్ దూసుకుపోతోంది. రాజమౌళి సినిమాకి అవసరమైన విధంగా ఆమె డేట్స్ దొరకడం కష్టమే. అందువల్లనే రాజమౌళి ఈ బాధ్యతను తన తనయుడు కార్తికేయకి అప్పగించాడట. ప్రస్తుతం ఆయన అజయ్ దేవగణ్ తో చర్చలు .. అలియా భట్ తో బేరసారాలు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
ajay devgan
alia bhatt

More Telugu News