Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్ట్రేలియాలో తెలుగు దంత వైద్యురాలు అదృశ్యం

  • ఆదివారం నుంచి ఆచూకీలేని ప్రీతి రెడ్డి
  • సిడ్నీలో కనిపించకుండాపోయినట్టు గుర్తింపు
  • ఆస్ట్రేలియా పోలీసుల ముమ్మర దర్యాప్తు
ఆస్ట్రేలియాలో తెలుగు దంత వైద్యురాలు ప్రీతి రెడ్డి అదృశ్యం కావడం స్థానిక తెలుగు వర్గాల్లో కలకలం రేపింది. ప్రీతి రెడ్డి వయసు 32 సంవత్సరాలు. ఆదివారం నుంచి ఆమె కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. సిడ్నీలో ఆమె ఆచూకీ లేకుండాపోయారని పోలీసులు చెబుతున్నారు.

సిడ్నీలోని ఎంతో రద్దీగా ఉండే జార్జ్ స్ట్రీట్ లో ఓ మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ వద్ద ప్రీతి చివరిసారిగా కనిపించినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. ప్రీతి రెడ్డి బతికుండే అవకాశాలు తక్కువని, ఈ విషయంలో తమకు కొన్ని ఆందోళనలు ఉన్నాయని న్యూసౌత్ వేల్స్ పోలీసు విభాగం ప్రతినిధి తెలిపారు. ఆదివారం నాడు తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ప్రీతి రెడ్డి వారాంతంలో సెయింట్ లియొనార్డ్స్ లో జరిగిన ఓ డెంటల్ సదస్సులో పాల్గొంది. సిడ్నీ మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ లో అల్పాహారం తీసుకుని ఇంటికి వస్తానని చెప్పిన తర్వాత ఆమె ఆచూకీ తెలియకపోవడంతో నేపియన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Australia

More Telugu News