భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మ డకౌట్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- తొలి ఓవర్ లోనే రోహిత్ ను పెవిలియన్ చేర్చిన కమిన్స్
- ధావన్ కు జతకలిసిన కోహ్లీ
మరోవైపు, టాస్ ఓడిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, టాస్ గెలిస్తే తాము బ్యాటింగ్ నే ఎంచుకోవాలని అనుకున్నామని చెప్పాడు. తొలి వన్డే ఆడిన జట్టే టీమిండియా తరపున బరిలోకి దిగింది. ఆసీస్ జట్టులో ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నారు.
ఈ సందర్భంగా కామెంటేటర్ గవాస్కర్ మాట్లాడుతూ, పిచ్ పై పగుళ్లు ఎక్కువగా ఉన్నాయని.. బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా ఉండకపోవచ్చని చెప్పారు. మ్యాచ్ కొనసాగే కొద్దీ స్పిన్నర్లకు లాభిస్తుందని అన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే వారికే ప్రయోజనం ఉండవచ్చని తెలిపారు.