సుకుమార్ తో అల్లు అర్జున్ మూడో సినిమా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుకుమార్ తో అల్లు అర్జున్ మూడో సినిమా

  • అల్లు అర్జున్ తాజా చిత్రం త్రివిక్రమ్ తో
  • తదుపరి సినిమా సుకుమార్ తో
  • ఇద్దరి కాంబినేషన్లోను 3వ సినిమా  
'నా పేరు సూర్య' పరాజయం తరువాత మంచి కథను సెట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో సినిమాను ఎనౌన్స్ చేసిన కొన్ని రోజులకే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ తన 19వ సినిమా కోసం .. త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.

'జులాయి'.. 'సన్నాఫ్ సత్యమూర్తి' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా ఫస్టు షెడ్యూ ల్ ను కూడా మొదలుపెట్టకముందే, తన 20వ సినిమాను సుకుమార్ తో చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించాడు. 'శివరాత్రి' పర్వదినం సందర్భంగా నిన్న ఈ ప్రాజెక్టును గురించిన ప్రకటన చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. 'ఆర్య' .. 'ఆర్య 2' తరువాత సుకుమార్ తో చేస్తున్న సినిమా ఇది. అటు త్రివిక్రమ్ తోను .. ఇటు సుకుమార్ తోను అల్లు అర్జున్ చేసేది 3వ సినిమా కావడం విశేషం. 
allu arjun
sukumar

More Telugu News