Anantapur District: మరదలిని లొంగదీసుకున్న బావ.. తల్లి అయిన ఇంటర్ విద్యార్థిని!

  • మరదలిపై పలుమార్లు అత్యాచారం
  • గర్భం దాల్చడంతో హాస్టల్ నుంచి ఇంటికి
  • ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రసవం
ఓ ఇంటర్ విద్యార్థిని అంబులెన్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కళ్యాణదుర్గానికి చెందిన బాలిక అనంతపురంలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుకుంటోంది. పట్టణంలోనే ఉంటున్న తన అక్కాబావల ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేది. ఈ క్రమంలో బావ కన్ను మరదలిపై పడింది. ఆమెను బలవంతంగా లొంగదీసుకుని పలుమార్లు కోరిక తీర్చుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది.

గర్భం దాల్చిన బాలిక తనకు ఆరోగ్యం బాగాలేదంటూ ఇటీవల స్వగ్రామానికి వచ్చేసింది. ఆదివారం రాత్రి ప్రసవ వేదన పడుతుండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలిక మగ శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Anantapur District
Kalyanadurgam
Inter girl
Andhra Pradesh

More Telugu News