గొల్లప్రోలులో తప్పిన పెను ప్రమాదం.. కాలిబూడిదైన యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ బోగీ
- గొల్లప్రోలు స్టేషన్లో ఘటన
- ప్యాంట్రీ కారులో అంటుకున్న మంటలు
- ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం
ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది రైలు నుంచి ఆ బోగీని వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా విశాఖపట్టణం-విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.