రేపటి నుంచి బయటికెళ్లేటప్పుడు జర భద్రం.. పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
- మహబూబ్నగర్లో అత్యధికంగా 36 డిగ్రీలు నమోదు
- శ్రీలంక నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి
- కోస్తాలో నేడు పిడుగులు పడే అవకాశం
మరోవైపు కోస్తాలో భిన్నమైన వాతావరణం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాల్లో నేడు పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.