కొరకరాని కొయ్యల్లా జాదవ్, ధోనీ... 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం
- సత్తా చాటిన మిడిలార్డర్
- రాణించిన కెప్టెన్ కోహ్లీ
- హైదరాబాద్ వన్డేలో ఆసీస్ ఓటమి
అంతకుముందు... టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓవర్లన్నీ ఆడినా 7 వికెట్లకు 236 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ ఖవాజా 50, స్టోయినిస్ 37, మ్యాక్స్ వెల్ 40 పరుగులు సాధించారు. వికెట్ కీపర్ క్యారీ 36 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లతో ఆసీస్ ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా భారత్ ఐదు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో వన్డే మార్చి 5న నాగ్ పూర్ లో జరగనుంది.