శ్రద్ధా కపూర్ కి పార్టీ ఇచ్చిన 'స్ట్రీట్ డాన్సర్' టీమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రద్ధా కపూర్ కి పార్టీ ఇచ్చిన 'స్ట్రీట్ డాన్సర్' టీమ్

  • వరుణ్ ధావన్ జోడీగా 'స్ట్రీట్ డాన్సర్'
  • ప్రభాస్ సరసన 'సాహో'
  • ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు రిలీజ్  
బాలీవుడ్ కథానాయికలలో శ్రద్ధా కపూర్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ వుంది. తాజాగా ఆమె హిందీలో వరుణ్ ధావన్ జోడీగా 'స్ట్రీట్ డాన్సర్' సినిమా చేస్తోంది. ఇక తెలుగులో ప్రభాస్ సరసన 'సాహో' సినిమా చేస్తోంది. ఈ రెండూ కూడా దేనికదే ప్రత్యేకతను సంతరించుకున్న భారీ సినిమాలు.

రేపు శ్రద్ధా కపూర్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా 'సాహో' సినిమా నుంచి ఆమె లుక్ ను రిలీజ్ చేయనున్నారు. అదే విధంగా శ్రద్ధా కపూర్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను వదలనున్నారు. ఇక ఇప్పుడు లండన్ లో వరుణ్ ధావన్ తో 'స్ట్రీట్ డాన్సర్' షూటింగులోనే శ్రద్ధా కపూర్ ఉండటం వలన, పుట్టినరోజుకి ముందుగానే షూటింగులో వరుణ్ ధావన్ హాడావిడి  చేసేశాడట. శ్రద్ధా కపూర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా టీమ్ పార్టీ ఇచ్చిందట. 'సాహో' ఆగస్టు 15వ తేదీన ... 'స్ట్రీట్ డాన్సర్' నవంబర్ 8వ తేదీన విడుదల కానున్నాయి.
varun
shraddha

More Telugu News